షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు నుండి శంషాబాద్‌లో నిర్వహించిన భారీ ఓబీసీ ఆత్మీయ సమ్మేళనానికి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. అగ్గనూర్ విశాలా విశ్వం పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని వార్డు ముఖ్య నాయకులు కిట్టు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. సభకు వెళ్లే ముందు స్థానికంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసి, శ్రేణులను ఉత్సాహంగా సాగనంపారు.

ఈ సందర్భంగా నాయకుడు కిట్టు మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల (ఓబీసీ) హక్కుల సాధన, సంక్షేమం మరియు రాజకీయ ప్రాతినిధ్యం కోసం శంషాబాద్ వేదికగా తలపెట్టిన ఈ మహాసభను విజయవంతం చేయడానికి 24వ వార్డు ప్రజలు, యువత స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చారని తెలిపారు. అగ్గనూర్ విశాలా విశ్వం నాయకత్వంలో వార్డు అభివృద్ధితో పాటు, బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఎల్లవేళలా ముందుంటామని ఆయన స్పష్టం చేశారు.

inline-img

ఈ కార్యక్రమంలో అగ్గనూర్ నందు, మోగి, సిద్దు, వెంకట్ రెడ్డి, పటోళ్ల మల్లికార్జున్, శ్రీకాంత్, సంపత్, సాయిలు, రాములు గౌడ్, రవి, మణికంఠ కాలనీవాసులు, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని సభకు ఉత్సాహంగా పయనమయ్యారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 4 Oct 2026 | 05:02 PM IST
Tags: