ఉచిత కోచింగ్, నెలకు వెయ్యి స్టైపెండ్
తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని 12 టీజీ బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్స్, బ్యాంకింగ్, SSC, RRB, పోలీస్ ఉద్యోగాల కోసం 125 రోజుల ఉచిత ఫౌండేషన్ కోచింగ్కు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. డిగ్రీ అర్హత కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు జూలై 25 నుంచి ఆగస్టు 14 వరకు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,000 స్టైపెండ్ అందించనుండగా, ఆగస్టు 25 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.