ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి భక్తులకు లలితా దేవి అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు దినేష్ శర్మ, శివ శర్మల పౌరోహిత్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. వాసవి రమేష్ బిక్కుమాండ్ల ఆధ్వర్యంలో అమ్మవారి ప్రీత్యర్థం ప్రత్యేక హోమం జరిపారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు వీరబొమ్మ రామ్మోహన్ పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కృష్ణయ్య, నరసింహ, డాక్టర్ శ్రీనివాస్, శ్రీనివాస్, కుమారస్వామి, అరవింద్, స్వాముల రవి, బొజ్జ నరసింహ, ఉప్పల శ్యామ్, చిత్తనూరి శ్యామ్, ఎల్గూరి ఉదయ్ తదితర ముఖ్య నాయకులు, మహిళలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.


