సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయండి
పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, డిండి ప్రాజెక్టులకు సత్వరమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు ఎంపీలతో కలిసి ఢిల్లీలోని పార్లమెంట్లో కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు.