కడ్తాల్: చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్వయంకృషితో సొంత వ్యాపారాలు ప్రారంభించి సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్, ఆమనగల్ సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా పిలుపునిచ్చారు. కడ్తాల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహ చికెన్ సెంటర్‌తో పాటు మక్తమాదారం గేటు వద్ద ఏర్పాటు చేసిన జనరల్ స్టోర్‌ను ఆయన లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం షాపు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా గంప వెంకటేష్ గుప్తా మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచించారు. పట్టుదలతో, కష్టపడే తత్వంతో కృషి చేస్తే చిన్న వ్యాపారాలే భవిష్యత్తులో పెద్ద సంస్థలుగా ఎదుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సొంత కాళ్లపై నిలబడేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు సేవ్యా నాయక్, నరసింహ గౌడ్, ఉప సర్పంచులు శ్రీనివాస్ గౌడ్, పాండు నాయక్, ఆమనగల్లు మున్సిపల్ కౌన్సిలర్ ఎనుమల రమేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కంబాలపల్లి పరమేష్, మాజీ ఎంపీటీసీ చంద్రమౌళి, నాయకులు జహంగీర్ అలీ, మాజీ వార్డు సభ్యులు హెచ్ఆర్ మహేష్, యూత్ వింగ్ అధ్యక్షుడు అంజి, రాములు యాదవ్, భీమ్లా నాయక్, శ్రీకాంత్ యాదవ్, జగదీష్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, గొర్ల వంశీ, కిరణ్ గౌడ్, శేఖర్ గౌడ్, సుదర్శన్ యాదవ్, తిరుపతిరెడ్డి, సాయిబాబా చారి, రాయకంటి, సురేష్, గూడూరు జంగారెడ్డి, గూడూరు శేఖర్ రెడ్డి, రాములు గౌడ్, యాదయ్య గౌడ్, బాల్ రాజ్, చెన్నకేశవ, అండే కార్ రమేష్, బాలకృష్ణ, వెంకటేష్‌లతో పాటు పలువురు స్థానిక నాయకులు, వ్యాపారస్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


