ఆమనగల్లు: కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మండలం కేంద్రంలో ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గురించిన అవగాహన సదస్సును కౌన్సిలర్ పాపిశెట్టి రాము ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును విధిగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చైతన్యవంతమైన యువత సరైన నాయకులను ఎన్నుకోవడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో 2023 సంవత్సరంలోపు డిగ్రీ పూర్తి చేసుకున్న అనేకమంది మహిళలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొని కొత్తగా ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

​ఈ కార్యక్రమంలో ఆర్ఎస్పీ ఫౌండేషన్ బోర్డు డైరెక్టర్ అశ్విన్ కుమార్, బోర్డు సభ్యులు బండల్ల చందు, కొమ్ము కిరణ్ కుమార్, దొబ్బల భాస్కర్, కొప్పు మహేష్, సింగపాకుల రాము, వసుపుల శ్రీకాంత్, యాదగిరి, స్థానిక నాయకులు శ్రీను నాయక్, రాములు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 16 Oct 2026 | 04:14 PM IST
Tags: