ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ కన్నుమూత
తెలుగు, హిందీ, తమిళ చిత్రాలలో ప్రసిద్ధ ప్రతినాయకుడిగా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ (74) ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బీఆర్ చోప్రా 'మహాభారత్'లో అశ్వత్థామ పాత్రతో పాటు 'సై', 'ఛత్రపతి', 'గజిని', 'లగాన్' వంటి చిత్రాలలో ఆయన పోషించిన విలన్ పాత్రలు విశేష ఆదరణ పొందాయి. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.