మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంఖల్ 67వ డివిజన్ నూతన బీజేపీ అధ్యక్షుడిగా మెగావత్ రవీందర్ నాయక్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనపై నమ్మకంతో డివిజన్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ అందెల శ్రీరాములు, అలాగే తన నియామకానికి సహకరించిన తుక్కుగూడ, మంఖల్ నాయకులు, జిల్లా పెద్దలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను అత్యంత నిబద్ధతతో నిర్వర్తిస్తూ మంఖల్ డివిజన్‌లో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని రవీందర్ నాయక్ పేర్కొన్నారు. సీనియర్ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి ముందుకు సాగుతానని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత చేరువవుతూ వారి సమస్యల పరిష్కారానికి పోరాడటంతో పాటు పార్టీ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తానని స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 15 Oct 2026 | 10:29 PM IST
Tags: