హైదరాబాద్: నగరంలోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

స్థానిక వివరాల ప్రకారం.. మృతుడిని రాంనగర్‌ నివాసిగా ఉన్న మనోజ్‌గా గుర్తించారు. మృతుడు శివం రోడ్డులోని అపోలో డయాగ్నొస్టిక్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తేలింది. అయితే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా లేక ఇతర ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 18 Sept 2026 | 12:21 PM IST
Tags: