ఆమనగల్లు: జాతీయ మానవ హక్కులు మరియు నేర నియంత్రణ బ్యూరో (NHRCCB) తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దుడ్డు ఆంజనేయులు నియమితులయ్యారు. మానవ హక్కుల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణలో తనవంతు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు ఆయనను ఈ పదవికి ఎంపిక చేశారు.

​ఈ సందర్భంగా దుడ్డు ఆంజనేయులు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో జాతీయ అధ్యక్షుడు రణ్‌ధీర్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు అలాగే ఇతర రాష్ట్ర స్థాయి నాయకులకు, కమిషన్ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, హక్కుల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆంజనేయులు నియామకం పట్ల పలువురు స్థానిక నాయకులు, హక్కుల సంఘం ప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 15 Oct 2026 | 02:45 PM IST
Tags: