బి.ఎన్.రెడ్డి నగర్: డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీ ఫేస్-1 లో జాతిపిత మహాత్మా గాంధీ మరియు దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను కాలనీవాసులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ జీహెచ్ఎంసీ తాజా మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా మొద్దు లచ్చి రెడ్డి మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య సంపాదనలో గాంధీ గారు చూపిన అహింసా మార్గం ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. అలాగే దేశ రక్షణకు సైనికులు, వ్యవసాయ రంగానికి అన్నదాతలు అందించిన సేవలను స్మరిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన 'జై జవాన్ - జై కిసాన్' నినాదం ఎప్పటికీ చిరస్మరణీయమని అన్నారు. ఈ మహనీయుల ఆశయాలు, విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆదర్శంగా తీసుకుని దేశ ప్రగతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విజయపురి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకట్ రెడ్డి, బీజేపీ పార్టీ డివిజన్ అధ్యక్షులు మరియు కాలనీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రావు, రంగారెడ్డి అర్బన్ జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీధర్ రావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, మహిళా నాయకురాలు సౌమ్య, సీనియర్ నాయకులు భూపాల్ రెడ్డి, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.


