ఫరూఖ్నగర్: గాంధీ జయంతిని పురస్కరించుకుని ఫరూఖ్నగర్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ చూపిన అహింస, సత్యం, శాంతి, సహనం అనే మార్గాలు ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ ఆదర్శమని అన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ చేసిన త్యాగాలు, దేశం కోసం ఆయన సాగించిన సుదీర్ఘ పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే సమాజంలో శాంతి, సమానత్వం, సోదరభావం పరిఢవిల్లుతాయని తెలిపారు. గాంధీజీ ఆశయాలను భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని అంజయ్య యాదవ్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వంకాయల నారాయణ రెడ్డి, కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ మన్నె కవిత నారాయణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నటరాజన్, మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, మాజీ గ్రంథాలయ చైర్మన్ లక్ష్మీనరసింహారెడ్డి, కౌన్సిలర్లు ప్రసన్నలత వేణుగోపాల్, శారద శేఖర్, జయలక్ష్మి కిషోర్, అనిత రఘునాథ్ యాదవ్, గోపాల్, ఎస్పీ శివ, మాజీ కౌన్సిలర్లు కానుగు అంతయ్య, జూపల్లి శంకర్, చెట్ల నరసింహా, చిన్న యాదగిరి, మాజీ సర్పంచ్ శ్రవణ్ పట్వారీ, నాయకులు నక్కల వెంకటేష్ గౌడ్, రవి యాదవ్, ఆకుల శీను, నందిగామ శ్రీనివాస్, జమాల్ ఖాన్, అందె జంగరాజ్, రాఘవేందర్, వీరేశప్ప, కొండ మల్లేష్, భిక్షపతి, చెర్క శివ, సుధాకర్, మేడిగ వీరేష్, బాలరాజు, శీను, వినోద్, ఉమాపతి, మంగ శ్రీశైలం, సాయి, పాండు, నరేష్, సుశాంత్, శ్రీకాంత్, రాజశేఖర్, వెంకటేష్, రఘు తదితరులు పాల్గొన్నారు.


