ఆమనగల్లు: పట్టణ కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు భక్తులకు ‘ధనలక్ష్మి’ అలంకరణలో దర్శనమిచ్చి కటాక్షించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు.

పెండ్యాల నాగరాజు దంపతులు ముఖ్య అతిథులుగా హోమ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు దినేష్ పూజారి, శివ స్వామి పౌరోహిత్యంలో వేదమంత్రాల మధ్య పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకల్లో మహిళలు పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వీరబొమ్మ రామ్మోహన్, బిగ్ మాల రమేష్, నర్సింహ, బి. కృష్ణయ్య, డాక్టర్ శ్రీనివాస్, పోలీస్ శ్రీనివాస్ తదితర ఆర్యవైశ్య ప్రముఖులు, నాయకులు, మహిళా భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 16 Oct 2026 | 10:37 PM IST
Tags: