మహేశ్వరం: మహేశ్వరం మండలం గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని గంగారం తండాలో మునావత్ పూజిత నరేష్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శుక్రవారం ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేఎల్ఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదలకు సొంతింటి కల సాకారమవుతోందని గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేదలకు సొంత ఇల్లు నిర్మించుకునే అవకాశం లభించడం చాలా సంతోషకరమన్నారు. ప్రభుత్వ పథకాల సహకారంతో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని, ప్రజలందరూ సంతోషంగా జీవించేలా కృషి చేస్తామని తెలిపారు. గంగారం గ్రామపంచాయతీ పరిధిలో ఇప్పటివరకు సుమారు 25 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్, ఉప సర్పంచ్ మహేందర్, వార్డు సభ్యులు ఎం. రవి, ఎం. మోహన్, ఎం. ధర్మ, ఎం. దేవా, ఎం. జ్యోతి, గోపి, శ్రీనివాస్, ఎం. రాజేష్, ఎం. నీలియా, ఎం. భాస్కర్, ఎం. లక్ష్మి, నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


