షాద్‌నగర్: సత్యం, అహింస, శాంతి, సామాజిక సమానత్వం వంటి మహాత్మా గాంధీ దివ్య ఆశయాలు నేటి సమాజానికి ఎల్లవేళలా మార్గదర్శకమని షాద్‌నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని షాద్‌నగర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సంగ్రామంలో గాంధీజీ పోషించిన పాత్ర అద్వితీయమైనదని, ఆయన చూపిన అహింసా మార్గం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను తెచ్చిపెట్టడంలో గాంధీజీ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. నేటి యువత గాంధీజీ సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని, ఆయన చూపిన అహింసా మార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సోదరభావం, సమగ్రత, ఐక్యతను పెంపొందించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీ కలలు కనిన గ్రామీణాభివృద్ధి, సామాజిక సమరసత లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబార్ అలీ ఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిప్పిశెట్టి కర్ణాకర్, పట్టణ అధ్యక్షుడు నల్లమొని శ్రీధర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు దంగు శ్రీనివాస్ యాదవ్, గిరిజన ఆదివాసి రాష్ట్ర కోఆర్డినేటర్ నాయక్, గ్రంథాలయ కమిటీ చైర్మన్ కొప్పుల మదన్ మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు కొప్పునూరి ప్రవీణ్, బచ్చలి నరేష్, దిలీప్, మురళీ మోహన్ అప్పి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఖదీర్, ముబారక్ అలీఖాన్, చందు లాల్, మాజీ జడ్పీటీసీ వెంకట రాం రెడ్డి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నియోజకవర్గం చైర్మన్ జాంగారి రవి, సింగిల్ విండో వైస్ చైర్మన్ తుపాకుల శేఖర్, రిటైర్డ్ తహశీల్దార్ సారపు జగదీష్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 2 Oct 2026 | 01:01 PM IST
Tags: