న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 11 నుంచి కెనడాలో అధికారికంగా పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరపనున్నారు.
ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం, ఆర్థిక సహకారం, కీలక రంగాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ కెనడా పర్యటనకు సంబంధించిన అధికారిక వివరాలను కెనడాలోని భారత హైకమిషన్ స్పష్టం చేసింది. తాజా పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు మరింత బలపడతాయని అంచనా వేస్తున్నారు.


