కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు జంగం వెంకటేష్ గౌడ్కు పార్టీలో సముచిత స్థానం లభించింది. ఆయన్ను నాగర్కర్నూల్ జిల్లా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓబీసీ కార్యదర్శిగా పార్టీ అధిష్టానం అధికారికంగా నియమించింది.
ఈ సందర్భంగా జంగం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. తన నియామకానికి విశేషంగా కృషి చేసిన బీజేపీ నేత ఆచారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నాగర్కర్నూల్ జిల్లాతో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోనూ బీజేపీ పటిష్టతకు, పార్టీ సిద్ధాంతాల వ్యాప్తికి శక్తివంచన లేకుండా శ్రమిస్తానని ఆయన స్పష్టం చేశారు. వెంకటేష్ గౌడ్ నియామకం పట్ల ఎక్వాయిపల్లి గ్రామస్తులు, స్థానిక బీజేపీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.


