ఫరూఖ్నగర్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫరూఖ్నగర్లో గాంధీజీ విగ్రహానికి మున్సిపల్ వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అందే మోహన్ ముదిరాజ్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలు, స్వాతంత్ర్య సాధన కోసం ఆయన సాగించిన పోరాటం తరతరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సత్యం, అహింస, శాంతి, సోదరభావం వంటి గాంధీజీ దివ్య ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితాల్లో ఆచరించాలని సూచించారు. ప్రజాసేవకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, సమాజంలో ఐక్యతను పెంపొందిస్తూ ముందుకు సాగడమే గాంధీజీకి అర్పించే నిజమైన నివాళి అని ఆయన అన్నారు. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన, సమానత్వంతో కూడిన సమసమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్ ముదిరాజ్, గ్రంథాలయ కమిటీ చైర్మన్ కొప్పుల మదన్ మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు కొప్పునూరి ప్రవీణ్, బచ్చలి నరేష్, దిలీప్, మురళీమోహన్, అప్పి, సి. పెంటయ్య, రాజు నాయక్, పి. గోపాల్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఖదీర్, ముబారక్ అలీఖాన్, చందులాల్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం, శ్రీనివాస్ యాదవ్, నీరటి వాసు, కత్తి చంద్రశేఖరప్ప, జయప్రకాష్, మంగ అశోక్, బీరప్ప, మేకల వెంకటేష్, గంగమోని సత్తయ్య, జంగయ్య, వీరేశం, చటన్పల్లి శేఖర్, సీతారాం, సాయి కుమార్, ప్రకాష్ తదితర నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


