షాద్‌నగర్: భారత రత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలు సమాజానికి ఎల్లప్పుడూ ఆదర్శనీయమని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని గురువారం స్థానిక మండల పరిషత్ ఆవరణలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం గొప్ప శాస్త్రవేత్తగా, నిస్వార్థ నేతగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేశానికి అందించిన సేవలు అపారమని కొనియాడారు. విద్యార్థులు, యువత కలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. మహనీయుల మార్గంలో నడవడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగునూరు బసవేశ్వర్, మాజీ మార్కెట్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మార్కెట్ డైరెక్టర్ కరుణాకర్, చెంది తిరుపతిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, పట్టణ అధ్యక్షుడు నలమోని శ్రీధర్, కౌన్సిలర్లు మురళీమోహన్ అప్పి, కళ్యాణ్ కార్ దిలీప్, ఫరూఖ్‌నగర్ మండల అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్, నాయకులు ముబారక్, మంగ మధు, ఇబ్రహీం, లింగారెడ్డిగూడ అశోక్, చందు నాయక్, బుడ్డ నరసింహ, రఫిక్ పటేల్, శ్రీహరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 15 Oct 2026 | 02:24 PM IST
Tags: