వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి సరైన సమయంలో వైద్యం అందిస్తే వారి ప్రాణాలను కాపాడవచ్చు. సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటను వైద్య పరిభాషలో 'గోల్డెన్‌ అవర్‌' అంటారు. ఈ సమయంలో సరైన అత్యవసర వైద్యం అందితే దాదాపు 50 శాతం మరణాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం 'పీఎం రాహత్' (రోడ్‌ ఆక్సిడెంట్‌ విక్టిమ్‌ హాస్పిటలైజేషన్‌ అండ్‌ అస్యూర్‌డ్‌ ట్రీట్‌మెంట్‌ - PM RAHAT) పథకాన్ని ప్రవేశపెట్టింది. రోడ్డు ప్రమాద బాధితులకు ఈ పథకం ద్వారా తక్షణమే ఉచితంగా నగదు రహిత వైద్య చికిత్స అందుతుంది.

పథకం విశేషాలు...
  • ఉచిత వైద్యం: ప్రమాదానికి గురైన ప్రతి బాధితుడికి గరిష్టంగా రూ. 1,50,000 వరకు ఉచితంగా నగదు రహిత వైద్యం లభిస్తుంది.

  • అన్ని రోడ్లకూ వర్తింపు: జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, నగరాలు మరియు పట్టణాల్లోని సాధారణ రోడ్లు.. ఇలా ఏ కేటగిరి రోడ్డుపై ప్రమాదం జరిగినా ఈ పథకం వర్తిస్తుంది.

  • అర్హత & రిజిస్ట్రేషన్: భారతదేశంలోని పౌరులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. దీనికోసం ముందస్తుగా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆధార్‌ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు ద్వారా ధ్రువీకరణ చేస్తారు.

  • ఖర్చుల భభరింపు: ఆసుపత్రులకు అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వం 'మోటార్‌ వెహికిల్‌ యాక్సిడెంట్‌ ఫండ్‌' ద్వారా నేరుగా చెల్లిస్తుంది.

సహాయం కోసం '112' హెల్ప్‌లైన్‌..

ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు లేదా అక్కడ ఉన్న ఎవరైనా సరే 112 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి అంబులెన్స్‌ సహాయాన్ని, అలాగే సమీపంలోని గుర్తించబడిన ఆసుపత్రి వివరాలను పొందవచ్చు. అత్యవసర సమయాల్లో ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Read latest Featured News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 2 Oct 2026 | 01:57 PM IST
Tags: