కేశంపేట: మండల పరిధిలోని సంతాపూర్ గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ప్రతిష్టించిన గణనాథుని మండపం వద్ద ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నాయకులు సాజిద్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, భక్తులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా తొలుత గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఇలాంటి ధార్మిక, సేవా కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు గ్రామంలో అందరి మధ్య ఐక్యతను, సోదరభావాన్ని చాటుతాయని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, సర్పంచులు వేణుగోపాల్, రామకృష్ణ, మాజీ సర్పంచ్ నవీన్ కుమార్, జమాల్, వినాయక కమిటీ సభ్యులు సురేందర్ రెడ్డి, సందీప్, చందు, తదితరులతో పాటు గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 21 Sept 2026 | 11:10 PM IST
Tags: