మాడుగుల: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం పరిధిలోని గిరికొత్తపల్లి గ్రామంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి దేవాలయ గుడి నిర్మాణ పనులకు సంబంధించి రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఉదారంగా ఆర్థిక విరాళం అందజేశారు. గ్రామంలో దైవ కార్యాలకు, ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అమ్మవారి ఆలయ నిర్మాణం వేగవంతంగా పూర్తి కావడానికి ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బ్రాహ్మం, గోపాల్ నాయక్, జంగయ్య, నర్సింహా, మరో జంగయ్య, ముత్తయ్య, తెలగమల్ల వంశీ, కేతావత్ సాయి తదితరులతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 21 Sept 2026 | 05:51 PM IST
Tags: