హయత్ నగర్: రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DMHO) డా. స్వర్ణకుమారి ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ క్లినిక్‌లపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా హయత్ నగర్ పరిధిలోని అజయ్ క్లినిక్‌ను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో డెమో గంగాసాని మంజుల, డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. సత్యరత్న, మెడికల్ ఆఫీసర్ డా. ప్రియాంక మరియు ఇతర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

అధికారులు పరిశీలించిన వివరాల ప్రకారం.. ఈ క్లినిక్ డా. సరిత (MBBS) పేరుతో రిజిస్టర్ అయి ఉంది. అయితే రిజిస్ట్రేషన్ గడువు ముగియడంతో దానిని రెన్యువల్ చేసుకోవడానికి మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా అసలు డాక్టర్ అందుబాటులో లేని సమయాలలో ఎలాంటి అర్హత లేని వ్యక్తి రోగులకు వైద్యం అందిస్తున్నట్లు తనిఖీలలో తేలడంతో, తక్షణ స్పందించిన అధికారులు ఆ క్లినిక్‌ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వైద్యం నిర్వహిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో డా. స్వర్ణకుమారి తీవ్రంగా హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 21 Sept 2026 | 06:16 PM IST
Tags: