ఆమనగల్లు: లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్ చార్టర్డ్ మెంబర్ లయన్ జూలూరి రమేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమనగల్ బస్టాండ్‌లో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులు, స్థానిక ప్రజలకు స్వయంగా అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదనే ఉదాత్తమైన భావనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

జన్మదిన వేడుకలను ఎలాంటి ఆడంబరాలకు దూరంగా ఉంచి, సమాజానికి ఉపయోగపడే సేవారూపంలో జరుపుకోవడం అభినందనీయమని పలువురు కొనియాడారు. లయన్స్ క్లబ్ సభ్యులు నిరంతరం సమాజహితం కోరుతూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే ఈ అన్న ప్రసాద వితరణ చేపట్టినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లయన్ వీరబొమ్మ భిక్షపతి, లయన్ గంప శ్రీనివాస్, లయన్ గంగుల శ్రీనివాస్ రెడ్డి, లయన్ జూలూరి లింగయ్య, లయన్ రాంరెడ్డి, గుజ్జరి నర్సింహ, లయన్ వీరబొమ్మ రామ్మోహన్, లయన్ సుధీర్ రెడ్డి, లయన్ పాండు రెడ్డి, లయన్ చేగురి వెంకటేష్, లయన్ మధుసూదన్ రెడ్డి, లయన్ డా. శ్రీనివాస్, లయన్ రాజు, లయన్ పిప్పళ్ల వెంకటేష్, బిచ్య నాయక్, లయన్ పి.ఆర్.ఓ. పాషా తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 2 Oct 2026 | 04:46 PM IST
Tags: