షాద్నగర్: పట్టణ ప్రజలకు ఆధునిక, నాణ్యమైన సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఆర్టీసీ కాలనీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘వెల్వెట్’ వాష్ లాండ్రీ & డ్రై క్లీనింగ్ షాప్ను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి షాప్ను ప్రారంభించిన అనంతరం నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రజలకు అవసరమైన ఆధునిక సేవలు షాద్నగర్ పట్టణంలో అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. నేటి వేగవంతమైన కాలంలో లాండ్రీ, డ్రై క్లీనింగ్ సేవలకు ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ వారి నమ్మకాన్ని గెలుచుకోవాలని సూచించారు. పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో నూతన వ్యాపార సంస్థల ఏర్పాటు స్థానిక ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని, యువతకు ఇవి స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, సింగిల్ విండో చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, కొత్తూరు మున్సిపల్ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం, సాదిక్, ముబారక్ అలీ ఖాన్, జయప్రకాష్, లైక్, వెంకటేష్, చటన్పల్లి శేఖర్ తదితర ముఖ్య నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.


