ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణంలోని స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు భక్తులకు 'అర్ధనారీశ్వరి' ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చి భక్తుల పూజలందుకున్నారు. అమ్మవారి దివ్యరూపాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు, ముఖ్యంగా మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ పవిత్ర వేడుకల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ హోమంలో కట్ట దేవేందర్ శెట్టి, బిక్కుమాండ్ల ప్రమోద్ కుమార్ దంపతులు ప్రధాన కర్తలుగా పాల్గొని పూజలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, కోశాధికారి డాక్టర్ బి. శ్రీనివాస్లతో పాటు కిట్టు పూజారి, దినేష్ పూజారి, ఆకుతోట శ్రీనివాస్, మండలం చంద్రశేఖర్, సామల కృష్ణయ్య, శ్యాంసుందర్ శ్యామ్, బిక్కుమాండ్ల కొండయ్య, అర్థం లక్ష్మయ్య, లక్ష్మయ్య, పెండ్యాల నాగరాజు తదితర ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మార్మోగింది.


