షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని నాగులపల్లి రోడ్డులో గల శ్రీ సాయి రాజా ఫంక్షన్ హాల్‌లో ‘తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్’ ముఖ్య సమావేశం అత్యంత వైభవంగా నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సుమారు 200 నుంచి 300 మందికి పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో సభ్యులంతా ఏకగ్రీవంగా చర్చించి, గత ఐదున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్న పాత కార్యవర్గ కమిటీని అధికారికంగా రద్దు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ ముఖ్య నాయకులు, సభ్యులు మాట్లాడుతూ.. గత ఐదున్నర ఏళ్లుగా పాత కమిటీ సభ్యులు సంఘ అభివృద్ధికి, వ్యాపారుల సంక్షేమానికి అంకితభావంతో కృషి చేశారని కొనియాడారు. అయితే అసోసియేషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి, నూతన ఆలోచనలు, ఉత్సాహంతో కూడిన నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. పాత కమిటీ రద్దు అయినందున, నిబంధనల ప్రకారం మరో మూడు నాలుగు రోజుల్లో నూతన కార్యవర్గ కమిటీ ఎన్నిక నిర్వహించి కొత్త బాధ్యులను ప్రకటిస్తామని వెల్లడించారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వ్యాపారుల హక్కుల పరిరక్షణకు, స్థానిక అభివృద్ధికి కట్టుబడి ఉండేలా సమర్థవంతమైన కమిటీని త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత కమిటీ జనరల్ సెక్రటరీ మంచిరేవుల అశోక్, కార్యవర్గ సభ్యులు ఎంబీ సాదిక్, ట్రెజరర్ సతీష్, జాయింట్ సెక్రటరీ ఖాదర్ గౌరీ, ఉపాధ్యక్షులు ఎంబీ కబీర్ అహ్మద్, స్థానిక వ్యాపారులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 13 Oct 2026 | 08:15 PM IST
Tags: