ఎల్‌బీనగర్: ఎంగిలి పూల బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం పలు ప్రత్యేక కార్యక్రమాల్లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.

షెడ్యూల్ ప్రకారం.. శనివారం మధ్యాహ్నం పాతబస్తీలోని చారిత్రాత్మక ఫలక్‌నుమా ప్రాంతంలోని కాళీమాత మందిరాన్ని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 7:00 గంటలకు ఎల్‌బీనగర్ నియోజకవర్గ పరిధిలోని హస్తినాపురం డీఆర్‌డీఎల్ కాలనీ పార్కులో నిర్వహించనున్న ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి, పండుగ శుభాకాంక్షలు తెలుపనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Oct 2026 | 01:56 PM IST
Tags: