హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలోని డీఎస్సీ 2008 ఉద్యోగాల నియామకాల వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ప్రభుత్వం జీవో నంబర్ 28ను సవరించిన విధానాన్ని సవాలు చేస్తూ డీఎస్సీ అభ్యర్థులు, బీఈడీ అభ్యర్థులు దాఖలు చేసిన మూడు వేర్వేరు పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం, సోమవారం వాదనలను ముగిస్తూ ఆ పిటిషన్లన్నింటినీ కొట్టివేసింది.

2008 డిసెంబర్ నాటి అసలు నోటిఫికేషన్ ప్రకారమే డీఎస్సీ-2008 ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాలని పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత జీవో నంబర్ 28ను జారీ చేసి రూల్ 7కు ప్రత్యేక నిబంధనలను జోడించడం సరికాదని బీఈడీ అభ్యర్థులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయా పోస్టులకు సంబంధించి ఎంపిక ప్రక్రియను కొనసాగించి అర్హులైన అభ్యర్థులకు పోస్టింగ్‌లు కూడా కేటాయించాయని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ దశలో జీవో 28 సవరణ అంశంపై ఎలాంటి నూతన ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 13 Oct 2026 | 08:22 PM IST
Tags: