కడ్తాల్: కడ్తాల్ మండల పరిధిలోని వెలుగురాళ్ల తండాలో శ్రీ తుల్జా భవానీ మాత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. వెలుగురాళ్ల తండాలో తుల్జా భవానీ మాత విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజల విశ్వాసాలకు ప్రతీకలైన ఆలయాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆలయ పెయింటింగ్ పనుల నిమిత్తం వ్యక్తిగతంగా రూ. 1,20,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాసేవతో పాటు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేసిన సాయం పట్ల ఆలయ కమిటీ సభ్యులు, తండావాసులు కృతజ్ఞతలు తెలిపి, ఆయన భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం అనంతరం మండలంలోని కర్కల్ పహాడ్ గ్రామంలో దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామ సర్పంచ్ తేజురాం నిర్వహించిన అమ్మవారి పూజా కార్యక్రమంలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆశీస్సులు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు చిట్టి రమేష్, తేజురాం, ఉప సర్పంచ్ పంత్య నాయక్, మాజీ సర్పంచ్ ఇస్లావత్ పాండు, వార్డు సభ్యులు దశరథ్, మోహన్, కిషన్, సీనియర్ నాయకులు ఇస్లావత్ నగేష్, రవి, కిరణ్, సరియా నాయక్, లోక్య నాయక్, జిలాని, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు ఎగిరిశెట్టి లింగం, రమేష్, మల్లేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


