శంషాబాద్: శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేందర్ రెడ్డిని పిల్లోనీగూడ గ్రామానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు స్థానిక ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందించాలని ఈ సందర్భంగా నాయకులు సీఐని కోరారు. సీఐ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పిల్లోనిగూడ పార్టీ నాయకులు కె. నరసింహ, గ్రామ ఉప సర్పంచ్ పిల్లి శ్రీశైలం ముదిరాజ్, నాయకులు జుర్కి రమేష్ పటేల్, పి. సుధాకర్, కె. మహేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


