కొల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మన్ బెట్ల గ్రామంలో ఘనంగా జరిగాయి. గురువారం ఎన్మన్ బెట్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సింధుజ సురేందర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవానికి, స్వరాష్ట్ర కాంక్షకు నిలువెత్తు చిరునామాగా నిలిచిన వ్యక్తి ఆచార్య జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు సిద్ధాంత భూమికను అందించి ప్రతి ఒక్కరిలో ఉద్యమ స్ఫూర్తిని నింపారని అన్నారు. ఆయన ఆశయాలను, అమూల్యమైన సిద్ధాంతాలను భావితరాలకు సస్కారవంతంగా చేర్చడం ప్రతి తెలంగాణ పౌరుడి ప్రాథమిక బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్మన్ బెట్ల గ్రామ సర్పంచ్ సింధుజ సురేందర్ రావు, మాజీ ఎంపీపీ రజిత భాస్కర్ గౌడ్, గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు పుట్ట చిన్న స్వామి (1వ వార్డు), పెబ్బేటి ఆంజనేయులు (3వ వార్డు), మరాటి మహేశ్వరి (9వ వార్డు), అలివేల మంచాల వెంకటయ్య (10వ వార్డు) లతో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని జయశంకర్ సార్ సేవలను స్మరించుకున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 6 Aug 2026 | 02:02 PM IST
Tags: