ఎల్‌బీనగర్: రజకుల సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 24న భారీ రజక మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్, తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర ఈ మహా పాదయాత్ర సాగనుంది.

ఈ సందర్భంగా రజకులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా రజక సోదరులు, సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని మొగ్గ అనీల్ కుమార్ పిలుపునిచ్చారు. రజకుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ఉద్యమించాలని ఆయన కోరారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Oct 2026 | 02:08 PM IST
Tags: