అమరావతి / విజయనగరం: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మైలురాయిగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు సందర్శనార్థం ప్రధాని నరేంద్ర మోదీ రాకకు సంబంధించి అధికారిక పర్యటన షెడ్యూల్ విడుదలైంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం పరిధిలో ప్రధాని మోదీ మొత్తం 2 గంటల 25 నిమిషాల పాటు గడపనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసింది.

ప్రధాని మోదీ నిమిషాల వారీ షెడ్యూల్:

  • ఉదయం 10:45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.

  • ఉదయం 10:45 – 10:50: గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతారు.

  • ఉదయం 10:50 – 10:55: కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు.

  • ఉదయం 10:55 – 10:58: 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్యంతో ప్రధానికి ఘనంగా స్వాగతం పలుకుతారు.

  • ఉదయం 11:00 – 11:15: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను ప్రధాని నేరుగా పరిశీలిస్తారు.

  • ఉదయం 11:17 – 11:25: టెర్మినల్ భవనం నుంచి ఓపెన్‌టాప్ జీప్‌లో సభా వేదికకు చేరుకుంటారు.

  • ఉదయం 11:30 – 12:55: విమానాశ్రయ ప్రారంభోత్సవం, అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాల ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

  • మధ్యాహ్నం 1:05 – 1:10: భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

భారీ భద్రతా ఏర్పాట్లు  

ప్రధాని రాక నేపథ్యంలో ఎస్పీజీ (SPG) బలగాల పర్యవేక్షణలో భోగాపురం పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానుండటంతో ట్రాఫిక్ మళ్లింపులు, విఐపి రూట్ భద్రతను ముందస్తుగా సమీక్షించారు.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 31 Jul 2026 | 09:26 AM IST
Tags: