కడ్తాల్: మండల కేంద్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి సన్నిధిని బీఆర్ఎస్ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు, సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోకకల్యాణం, ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు మరియు రాష్ట్ర సుభిక్షం కోసం దుర్గమ్మను వేడుకున్నట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవరచుకోవాలని కోరారు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో వానలు విరివిగా కురిసి, పంటలు సమృద్ధిగా పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం ఉత్సవ సమితి నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కరుణాకర్, హనుమాన్ యూత్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, కంటేకార్ తిరుమలేష్, జగత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మాధారం మహేష్, సాయి ప్రభు, యాదగిరి, శ్యామ్ సుందర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


