షాద్నగర్: పట్టణంలోని పరిగి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన 'నెల్లూరు చేపల పులుసు' రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులకు అంజయ్య యాదవ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ.. వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. స్థానికంగా నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటవడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, పట్టణ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ మన్నె కవిత నారాయణ, మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, సర్పంచ్ గీత వీరేశం, కౌన్సిలర్ శారద శేఖర్, మాజీ కౌన్సిలర్లు యుగంధర్, జూపల్లి శంకర్, చిన్న యాదగిరి, నాయకులు రవి యాదవ్, వెంకటేష్, కొండి యాదయ్య, గాదె సుధాకర్, భిక్షపతి, చెర్క శివ, సత్యం, రాఘవేందర్ గౌడ్, నవీన్, రాజశేఖర్, ప్రవీణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


