హైదరాబాద్: ప్రజా భవన్‌లో నల్లపోచమ్మ అమ్మవారి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
రాష్ట్ర సుభిక్షతకై ప్రత్యేక పూజలు
ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. మంత్రులంతా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లాలని ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకున్నట్లు నాయకులు తెలిపారు.


