భాగ్యనగర్ (హైదరాబాద్): భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నూతన కార్యాలయ ప్రారంభోత్సవం, ప్రత్యేక విఘ్నేశ్వర పూజా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం 2026 జూలై 23, గురువారం ఉదయం 10:00 గంటలకు సిద్ధి అంబర్ బజార్‌లోని రాజధాని హోటల్ పక్కన ఉన్న 'బహేతి భవన్' లో వైభవంగా జరగనుంది.

తిలక్ జయంతి వేడుకలు 

కార్యాలయ ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమం ముగిసిన అనంతరం శ్రీ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విఘ్నేశ్వర పూజ, ప్రారంభోత్సవ కార్యక్రమానికి భక్తులు, ప్రతినిధులు, ప్రజలందరూ ఆహ్వానితులేనని సమితి అధ్యక్షులు జి. రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్ వెల్లడించారు.

inline-img

వినాయక చవితి, నిమజ్జన తేదీల ప్రకటన 

ఇదిలా ఉండగా, ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి సెప్టెంబర్ 14 (సోమవారం) నాడు వినాయక చవితి వేడుకలు, సెప్టెంబర్ 25 (శుక్రవారం) నాడు అనంత చతుర్దశి సందర్భంగా సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి వర్గాలు స్పష్టం చేశాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 21 Jul 2026 | 01:55 PM IST
Tags: