ఆమనగల్లు: దసరా పండుగ ఉత్సవాలను పురస్కరించుకుని ఆమనగల్లు పట్టణం సర్వాంగసుందరంగా ముస్తాబవుతోంది. దసరా ఉత్సవ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో చేపడుతున్న అలంకరణలు, ఇతర ఏర్పాట్లను బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి శనివారం దగ్గరుండి పర్యవేక్షించారు. ఉత్సవాలు ఘనంగా, ఎలాంటి లోపాలు లేకుండా జరిగేలా సంబంధిత కమిటీ సభ్యులకు పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దసరా వేడుకలు ప్రజలందరూ సంతోషంగా, సాంప్రదాయ బద్ధంగా జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు మాజీ జడ్పీటీసీ కండె హరిప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోరటి నరసింహ, మున్సిపల్ కౌన్సిలర్లు సునీత ప్రశాంత్ నాయక్, ఎర్రవోలు మహేష్, కో-ఆప్షన్ సభ్యులు చుక్క అలాజీ, మాజీ కౌన్సిలర్లు దివ్య శ్రీకాంత్ సింగ్, చెన్నకేశవులు, దుడ్డు కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 17 Oct 2026 | 09:44 PM IST
Tags: