గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సాంబయ్యపల్లి గ్రామంలో బతుకమ్మ, విజయదశమి పండుగలను పురస్కరించుకుని గ్రామపంచాయతీ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు సరికొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఉచితంగా దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గ్రామ సర్పంచ్ గడ్డం రమ్య-ఉదయ రెడ్డి దంపతులు స్వయంగా కార్మికులకు నూతన వస్త్రాలను అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామ అభివృద్ధిలో, పారిశుద్ధ్య నిర్వహణలో నిరంతరం శ్రమిస్తున్న సిబ్బంది సేవలను ఈ సందర్భంగా సర్పంచ్ అభినందించారు. పండుగ వేళ తమను గుర్తించి దుస్తులు అందజేయడం పట్ల గ్రామపంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు సర్పంచ్ దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జీల రాజవ్వ, నూకల రమణ, అనిల్ రెడ్డి, జీల మహేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


