ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు (అమంగల్) మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డుకు చెందిన కొట్ర ఆనంద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో, అతని వైద్య ఖర్చుల నిమిత్తం ప్రముఖ సంఘ సేవకులు, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు, కౌన్సిలర్ పాపిశెట్టి రామన్న ఆర్థిక సహాయం అందజేశారు.

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు తనవంతు చేయూత అందించడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు. మానవత్వమే నిజమైన సేవ అని, సమాజంలో కష్టాల్లో ఉన్నవారికి సహాయపడటమే గొప్ప మేలని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించిన కౌన్సిలర్ పాపిశెట్టి రామన్నకు స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామన్న మిత్రమండలి సభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీను నాయక్, వడ్డే మోని శివ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 17 Oct 2026 | 09:48 PM IST
Tags: