ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలో ఈసారూ దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆమనగల్ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్, మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేడుకల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ పత్య నాయక్ మాట్లాడుతూ.. ఆమనగల్‌లో జరిగే దసరా ఉత్సవాలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, భక్తులు తరలివస్తారని తెలిపారు. వచ్చే ప్రతి ఒక్కరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం తదితర మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. భారీ జనసందోహం దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు శాఖకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు నాగిళ్ల జగన్, అనుష శ్రీశైలం, ఎనుమల రమేష్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, కోఆప్షన్ సభ్యులు అల్లాజి గౌడ్, ఖండే భాస్కర్, మున్సిపాలిటీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 14 Oct 2026 | 09:35 PM IST
Tags: