కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు.

గ్రామ సర్పంచ్ శ్రీమతి పొగాకు సంధ్య వెంకటేష్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వేడుకగా సాగింది. గ్రామానికి నూతన పంచాయతీ భవనం అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలు, కార్యకర్తలు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. కార్యాలయ ప్రారంభం సందర్భంగా నూతన భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 14 Oct 2026 | 09:30 PM IST
Tags: