ఫరూఖ్‌నగర్: రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యావరణ పరిరక్షణపై అందరికీ అవగాహన కల్పించారు. అనంతరం గ్రామస్తులకు వివిధ రకాల పండ్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు స్థానిక పాఠశాల ఆవరణలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు కలిసి మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ఎంసి ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ ఎర్రోళ్ల అశోక్ హాజరై స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. చెట్లను పెంచడం వల్లనే భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాము, వార్డు సభ్యులు గోదా లక్ష్మయ్య యాదవ్, మెహరాజ్, శశాంక్ గౌడ్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకరయ్య పాల్గొన్నారు. వీరితో పాటు గ్రామస్తులు గోదా రమేష్ యాదవ్, దాదేమియా, మంగలి మల్లేష్, కాల్ అప్ప, లక్ష్మారెడ్డి, బస్తాపురం అంజయ్య, శివకుమార్, సంగ్రామ్, మహేందర్ తదితరులు పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 4 Aug 2026 | 09:45 PM IST
Tags: