షాద్‌నగర్: షాద్‌నగర్ పట్టణ చౌరస్తా రహదారి విస్తరణ పనులకు స్థానిక ఇంటి యజమానులు, వ్యాపారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ప్రజల ప్రాణాలు, వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు సూచించిన మార్కింగ్ మేరకు తమ ఆక్రమిత నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు.

అధికారుల హెచ్చరికలతో ముందస్తు చర్యలు

షాద్‌నగర్ చౌరస్తా విస్తరణలో భాగంగా పరిగి రోడ్డు ప్రాంతంలో మున్సిపల్, ఆర్ అండ్ బీ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. రోడ్డును ఆక్రమించిన డబ్బాలు, నిర్మాణాలను తొలగించడమే కాకుండా, మార్కింగ్ చేసిన హద్దుల వరకు ఉన్న భాగాలను రెండు రోజుల్లో స్వయంగా తొలగించాలని యజమానులకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పరిగి రోడ్డులోని బాటా షోరూమ్ పక్కనున్న ఇంటి యజమానితో పాటు పలువురు యజమానులు సోమవారం తమ నిర్మాణాలను స్వయంగా కూల్చివేసే పనులు ప్రారంభించారు.

స్థానికుల ప్రశంసలు

పట్టణ అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల కోసం రహదారి విస్తరణకు సహకరిస్తూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన గృహ యజమానులను షాద్‌నగర్ ప్రజలు అభినందిస్తున్నారు. రోడ్డు ఆక్రమణలకు గురైన మిగిలిన యజమానులు కూడా ఇదే రీతిలో స్పందించి స్వచ్ఛందంగా నిర్మాణాలను తొలగించాలని, పట్టణ అభివృద్ధికి సహకరించాలని స్థానికులు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 3 Aug 2026 | 06:15 PM IST
Tags: