న్యూఢిల్లీ: దేశీయ వినియోగదారులు, వ్యాపార వర్గాలకు కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెద్ద ఊరటనిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలకు అనుగుణంగా 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించాయి. ఈ ఏడాదిలో కమర్షియల్ సిలిండర్ ధర తగ్గడం ఇదే మొదటిసారి. వివిధ నగరాలను బట్టి ఈ తగ్గింపు ₹173 నుండి ₹183.50 వరకు ఉంది.
కమర్షియల్ గ్యాస్ కొత్త ధరలు
తాజా తగ్గింపుతో దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధరలు ఈ విధంగా మారాయి.
హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులకు ఈ నిర్ణయం ఎంతో ఆర్థిక ఊరటను ఇస్తుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పశ్చిమ ఆసియా సంక్షోభం ముగింపు దశకు రావడంతో పాటు దేశీయంగా ఉత్పత్తి పెరగడం వల్లే సరఫరా ఇబ్బందులు తొలగి ధరలు తగ్గుముఖం పట్టాయి.
స్థిరంగా గృహ వినియోగ సిలిండర్.. సీఎన్‌జీ ధరలు
కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గినప్పటికీ.. ఇళ్లలో వాడే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ నగరంలో గృహ వినియోగ సిలిండర్ ధర ₹994 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. ఢిల్లీలో దీని ధర ₹942 గా ఉంది.
మరోవైపు వాహనదారులకు సైతం ఊరట లభించింది. సిటీల్లో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG), పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) ధరలను కూడా చమురు సంస్థలు యథాతథంగా ఉంచాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో సీఎన్‌జీ కిలో ధర ₹109 గా, పీఎన్‌జీ ధర ₹51 గా స్థిరంగా ఉన్నాయి. దీనితో పాటు విమాన ఇంధనం (ATF) ధరలను లీటరుకు ₹5 వరకు తగ్గించడం వల్ల విమానయాన సంస్థల నిర్వహణ భారం కాస్త తగ్గనుంది.


