సికింద్రాబాద్: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. చారిత్రాత్మక శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయంతో పాటు సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రధాన అమ్మవారి ఆలయాలను విద్యుత్ దీపాలు, రంగులతో ముస్తాబు చేశారు. ఆగస్టు 2, 3 తేదీల్లో అత్యంత వైభవంగా జరగనున్న ఈ జాతర ఉత్సవాలకు దాదాపు 25 నుంచి 30 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కట్టుదిట్టమైన భద్రత, క్యూలైన్ల నిర్వహణ

భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశాయి. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో తాత్కాలిక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, సిసిటివి నిఘా ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

దర్శనాల కోసం మొత్తం 6 క్యూ లైన్లను అందుబాటులోకి తెచ్చారు.

  • 2 బోనాల క్యూ లైన్లు: బోనాలు సమర్పించే మహిళా భక్తుల కోసం.

  • 2 జనరల్ లైన్లు: సాధారణ దర్శనాల కోసం.

  • 2 విఐపి లైన్లు: ప్రముఖుల దర్శనాల కోసం.

తాగునీరు, వైద్య సేవల ఏర్పాట్లు

వర్షాల దృష్ట్యా భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక షెడ్లు నిర్మించారు. జలమండలి ఆధ్వర్యంలో భక్తుల దాహార్తి తీర్చేందుకు 5 ప్రాంతాల్లో తాగునీటి క్యాంపులు ఏర్పాటు చేయగా, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా 3 ప్రత్యేక మెడికల్ క్యాంపులను అందుబాటులో ఉంచారు.

8 ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం

జాతరకు వచ్చే వాహనాల రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు 8 ప్రధాన పార్కింగ్ స్థలాలను కేటాయించారు.

  • హరిహర కళా భవన్ పక్క రోడ్డు, మహబూబ్ కళాశాల స్కూల్, ఓల్డ్ జైల్ ఖానా, మోండా మార్కెట్ వెనుక ఉన్న ఇస్లామియా స్కూల్, అడవయ్య ఎక్స్ రోడ్డు సమీపంలోని ఆదయ్య మెమోరియల్ స్కూల్, ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద, బెల్సన్ తాజ్ హోటల్ పరిసర ప్రాంతాలు, తాజ్ త్రీస్టార్ హోటల్ వద్ద జాతర సజావుగా సాగేందుకు అధికారులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 31 Jul 2026 | 11:11 AM IST
Tags: