బిజినెస్ డెస్క్: ఇటీవలి కాలంలో కొంతమేర తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు మళ్లీ యూటర్న్ తీసుకున్నాయి. గత రెండు రోజులుగా దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. శనివారం ఉదయం మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు

​గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • 24 క్యారెట్ల బంగారం:  ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,47,010 గా నమోదైంది.
  • 22 క్యారెట్ల బంగారం: ఆభరణాల పసిడి 10 గ్రాముల ధర రూ.1,34,760 వద్ద కొనసాగుతోంది.
  • 18 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ.1,10,260 గా ఉంది.
  • ​తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ నగరాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాలలోనూ ఇదే తరహా ధరలు కొనసాగుతున్నాయి.

    inline-img

    దేశంలోని ప్రధాన నగరాల్లో (10 గ్రాములు):

    • చెన్నై: 24 క్యారెట్ల ధర రూ.1,49,570 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,37,010 గా ఉంది.
    • న్యూఢిల్లీ: 24 క్యారెట్ల ధర రూ.1,47,160 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,34,910 వద్ద నమోదైంది.
    • ముంబై, బెంగళూరు, కోల్‌కతా: ఈ నగరాల్లో 24 క్యారెట్ల ధర రూ.1,47,010 గా, 22 క్యారెట్ల ధర రూ.1,34,760 గా కొనసాగుతోంది.
    • మళ్లీ పెరిగిన వెండి

      ​బంగారంతో పాటే వెండి కూడా మార్కెట్‌లో పెరుగుదలను నమోదు చేసింది. కిలో వెండిపై వంద రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ నగరాలలో కిలో వెండి ధర రూ.2,60,100 వద్ద విక్రయాలు సాగుతున్నాయి.

      గమనిక: బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల బట్టి ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వినియోగదారులు నగలు కొనే సమయంలో మరోసారి లైవ్ ధరలను పరిశీలించుకోవాలి.

      Read latest Business News and Telugu News
      Follow us on Facebook, Twitter & Instagram.
      Updated: 10 Jul 2026 | 12:46 PM IST