భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి తీవ్ర రూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటిమట్టం వేగంగా పెరుగుతూ 43 అడుగులు దాటి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

ఐటీడీఏ భద్రాచలంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్

గోదావరి ఉధృతి, భారీ వర్షాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు మరియు బాధితులకు తక్షణ సహాయక చర్యలు అందించేందుకు ఐటీడీఏ భద్రాచలంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (PO) బి. రాహుల్ తెలిపారు.

అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే

ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా, వరద సహాయం కావాలన్నా ప్రజలు ఫోన్ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

  • ఐటీడీఏ భద్రాచలం కంట్రోల్ రూమ్: 7995268352

  • సబ్ కలెక్టర్ కార్యాలయం: 08743-232444

  • వరదల ప్రత్యేక కంట్రోల్ రూమ్: 7981219425

నిరంతర పర్యవేక్షణ

వరద ముప్పు ఉన్న గ్రామాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కంట్రోల్ రూమ్ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తారని ఐటీడీఏ పీవో తెలిపారు. నొక్కి చెప్పారు. అధికారుల ఆదేశాలు పాటించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 31 Jul 2026 | 07:26 PM IST
Tags: