హైదరాబాద్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) బషీర్బాగ్ నగర నూతన కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటించింది. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఏబీవీపీ నాయకుడు నిఖిల్ ముఖ్య అతిథిగా హాజరై ఈ నూతన కమిటీ వివరాలను వెల్లడించారు.

అధ్యక్షుడిగా డాక్టర్ రాజు, కార్యదర్శిగా సురేందర్

నూతన కార్యవర్గంలో నగర అధ్యక్షుడిగా డాక్టర్ రాజు, కార్యదర్శిగా నిజాం కళాశాలకు చెందిన సురేందర్ వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, విద్యార్థుల హక్కుల పరిరక్షణ, క్యాంపస్‌లలో సమస్యల పరిష్కారం కోసం నూతన కమిటీ నిరంతరం శ్రమిస్తుందని నాయకులు తెలిపారు.

ఆదర్శ నగర శాఖగా తీర్చిదిద్దుతాం

నూతనంగా ఎన్నికైన నగర కార్యదర్శి సురేందర్ మాట్లాడుతూ... బషీర్‌బాగ్ నగర శాఖను తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత క్రియాశీలక, ఆదర్శ శాఖగా తీర్చిదిద్దేందుకు ప్రతి కార్యకర్తతో కలిసి పనిచేస్తానని చెప్పారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాబోయే రోజుల్లో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 3 Aug 2026 | 10:23 PM IST
Tags: